సంబరపడిపోతున్న రాజమౌళి

బాలీవుడ్ స్టార్‌ హీరోలు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’. ఈ సినిమా తెలుగులో సైతం రిలీజ్ కానుంది. ఈ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఈరోజు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు.

ఇలా ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయడం గొప్పగా భావిస్తున్నానని, అమీర్ ఖాన్, అమితాబ్ ఇలా ఇద్దర్నీ కలిసి స్క్రీన్ మీద చూడటం ఒక వేడుకలా ఉందని సంబరపడిపోయాడు రాజమౌళి. ఈ సినిమా ఫాతిమా సనా షేక్, కత్రినా కైఫ్ లు కూడ నటిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇకపోతే తమిల్ వెర్షన్ ట్రైలర్ ను కమల్ హాసన్ రిలీజ్ చేశారు.