
Anaganaga OTT:
సుమంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం అనగనగా ఇప్పుడు అందరి నోటా నానుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ETV Win లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసి అద్భుతమైన రిస్పాన్స్ తెచ్చుకుంది. ఇంటి దగ్గరే హృదయానికి హత్తుకునే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది బాగా నచ్చింది.
సినిమాకి వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ ఇప్పుడు ఒక ఇంట్రస్టింగ్ డెసిషన్ తీసుకున్నారు. మే 27న ఈ సినిమాను థియేటర్లలో లిమిటెడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఓటీటీ ఫిల్మ్‌కు థియేట్రికల్ ట్రెండ్ సెట్ చేసే అవకాశం అని అంటున్నారు సినీ వర్గాలు.
ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సన్నీ సంజయ్, ఓ సాధారణ స్కూల్ టీచర్ పాత్ర ద్వారా సమాజంలోని నిబంధనల్ని ఎలా ఎదుర్కొంటాడన్న అంశాన్ని ఎంతో సెన్సిటివ్‌గా చూపించారు. సుమంత్ చేసిన పాత్రలో ఎమోషన్, ఇంటెన్సిటీ అద్భుతంగా కనిపించాయి. ఆయనకు ఇది కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అనేలా ఫీల్ అయ్యేలా ఉంది.
ఓటీటీ లో ఇంత విజయం సాధించిన సినిమా, థియేటర్లలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశిస్తున్నారు. థియేటర్ అనుభూతి కోసం వెయిట్ చేస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇది మంచి ఎంటర్టైన్‌మెంట్ అవుతుంది.
ఇక ఈ చిత్రం మరోసారి బిగ్ స్క్రీన్ పై అదే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా? అని తెలుసుకోవాలంటే మే 27 వరకు వెయిట్ చేయాల్సిందే.













