మళ్ళీ కామెడీ చేయడానికి సిద్ధం!

తెలుగులో స్టార్ కమేడియన్ గా ఉన్న దశలో సునీల్ కామెడీ రోల్స్ ను చేయడం ఆపేశాడు. ‘మర్యాదరామన్న’ సూపర్ హిట్ తర్వాత చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. హీరో పాత్రలకే పరిమితం అయ్యాడు. హీరోగా చేసిన వరస ప్రయత్నాలేవీ సరైన హిట్ ను ఇవ్వకపోవడంతో సునీల్ రూటు మారుస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. తిరిగి కమేడియన్ పాత్రల్లో నటించడానికి సిద్ధమని ఇతడు ప్రకటించాడు.

ప్రస్తుతం సునీల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఉంగరాల రాంబాబు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సంధర్భంగా సునీల్ పాత తరహాలోనే కామెడీ పాత్రల్లో దూసుకుపోతాను అంటూ ప్రకటించేశాడు. ఇకపై ఇతర హీరోల సినిమాల్లో కమెడియన్ తరహా పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. అలా అని హీరో పాత్రలను పూర్తిగా వదిలేసుకోలేదని.. హీరోగా వచ్చే అవకాశాలను వినియోగించుకుంటానని స్పష్టం చేశాడు. ఇది సునీల్ కామెడీని ఇష్టపడే వారికి ఆనందకరమైన విషయమే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here