సుకుమార్ సినిమా పై మహేశ్‌ ట్వీట్‌

రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సుకుమార్ తాజాగా బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. వాస్తవానికి మహేశ్ బాబు హీరోగా మైత్రి మూవీస్ బ్యానర్‌లో సుకుమార్‌ తర్వాతి సినిమా ఉంటుందని గత ఏడాది అక్టోబర్‌లో అధికారికంగా ప్రకటించారు. ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అప్పుడే నిర్మాతలు చెప్పారు. ఇది మహేశ్ బాబు 26వ సినిమా. కానీ సడెన్‌గా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా తెరమీదకు వచ్చింది.

మహాశివరాత్రి సందర్భంగా మైత్రీ మూవీస్ మేకర్స్‌లో సుకుమార్ దర్శకత్వంలో బన్నీ తన 20 సినిమాను అఫీషియల్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 19 మూవీ చేస్తున్నారు బన్నీ. ఈ సినిమా మార్చి చివరి వారంలో షూటింగ్‌కి వెళ్లనుండగా.. ఆ తర్వాత సుకుమార్‌తో సినిమా ఉంటుంది. ‘ఆర్య’తో వీరిద్దరూ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

మరీ మహేశ్ బాబుతో సుకుమార్ సినిమా ఏమైంది? దీనికి ట్విట్టర్ వేదికగా మహేశ్‌ సమాధానం ఇచ్చాడు. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సుకుమార్‌తో సినిమా చేయడం లేదని చెప్పాడు. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సుక్కూకి ప్రిన్స్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా సుకుమార్‌పై సూపర్ స్టార్ ప్రశంసలు గుప్పించాడు. సుకుమార్ అంటే నాకెంతో గౌరవమన్న ప్రిన్స్.. 1 నేనొక్కడినే సినిమా ఓ క్లాసిక్‌గా మిగిలిపోతుందన్నాడు. ఆ సినిమా కోసం పని చేసిన ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు.