HomeTelugu Trendingసైరా దర్శకుడితో ప్రభాస్‌..!

సైరా దర్శకుడితో ప్రభాస్‌..!

3 3యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ‘సాహో’ ప్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోయింది. ఎవరూ ఊహించని విధంగా వసూళ్లు రాబట్టడంలో.. సాహో టీమ్ సైతం ఖుషి అయ్యింది. ప్రస్తుతం ప్రభాస్ .. ‘జిల్’ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నది.

ఇదిలా ఉంటె, ఈ సినిమా తరువాత ప్రభాస్ సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సైరా సినిమా మేకింగ్ విధానం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. చారిత్రాత్మక సినిమాను ఇప్పటి తరం ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చిత్రీకరించాడు సురేందర్ రెడ్డి. ప్రభాస్ కోసం ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ కథను దర్శకుడు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!