HomeTelugu Trendingసూర్య 'ఆకాశం నీ హద్దురా!' టీజర్‌

సూర్య ‘ఆకాశం నీ హద్దురా!’ టీజర్‌

5 6
హీరో సూర్య నటిస్తున్న’ఆకాశం నీ హద్దురా!’ మూవీ టీజర్‌ విడుదలైంది. సినీ ప్రముఖులు వెంకటేష్‌, ప్రభాస్‌, సమంత, నందినిరెడ్డి, సందీప్‌ రెడ్డి వంగా టీజర్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘జేబులో రూ.6వేలు పెట్టుకుని.. విమానాల కంపెనీ పెడతానని ఒకడొస్తే ఎవడ్రా ఈ పిచ్చోడని లోకం వాడిని చూసి నవ్వింది’ అనే మోహన్‌బాబు డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది. ఎయిర్‌లైన్‌ సర్వీస్‌ ప్రారంభించాలని కలలు కనే ఓ సాధారణ యువకుడిగా సూర్య కనిపించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లను టీజర్‌లో చూపించారు. నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఓ సాధారణ వ్యక్తి అసాధారణమైన కల.. అంటూ ప్రచార చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. సూర్య కొత్త లుక్‌లో విభిన్నంగా కనిపించారు.

సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అపర్ణ బాలమురళి, జాకీ ష్రాఫ్‌, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య, గుణీత్‌ మొన్గా నిర్మాతలు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!