‘సైరా’ సింగిల్‌ షెడ్యూల్ కోసం రూ.50 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం నిర్మాత రామ్ చరణ్ భారీ బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రూ.20 నుంచి రూ.30 కోట్లు రూపాయల బడ్జెట్ అంటే వామ్మో అనుకునేవారు. బడా హీరోల సినిమాలకు అంతవరకు ఖర్చు పెట్టేవారు. బాహుబలి తరువాత అంకెలు మారిపోయాయి. భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు సమాయత్తం అవుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ నిర్మాతగా మారి మెగాస్టార్ చిరంజీవితో సైరా చేస్తున్నారు. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ కంప్లీట్ అయింది. యుద్ధాలకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ జార్జియా బయలుదేరి వెళ్తున్న సంగతి తెలిసిందే. అక్కడ 20 రోజులపాటు షూట్ చేయబోతున్నారు. ఈ 20 రోజుల షూట్ కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తున్నది. ఖర్చు ఏ మాత్రం వెనకాడవద్దని, పోరాట దృశ్యాలు అద్భుతంగా చిత్రీకించాలని దర్శకుడు సురేందర్ రెడ్డికి చరణ్ చెప్పాడట. నిర్మాత చరణ్ ఇచ్చిన ధైర్యంతో దర్శకుడు ముందుకు అడుగు వేస్తున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2019 వేసవికి ‘సైరా’ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.