టబుకి పెళ్లి కాకపోవడానికి కారణం ఆ హీరోనే అట!

సినిమా ఇండస్ట్రీలో ఏళ్ళు గడుస్తున్నా.. పెళ్లి చేసుకోకుండా ఉన్న నటీనటులు చాలా మంది ఉన్నారు. ఈ లిస్ట్ లో ఉన్న సీనియర్ హీరోయిన్ టబు కూడా ఉన్నారు. గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి పేరు తెచ్చుకున్న టబు ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. దశాబ్ధాలుగా ఆమెను అందరూ అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అని. ఈ నేపధ్యంలో మరోసారి అదే ప్రశ్న ఆమెకు ఎదురవ్వగా, ఈసారి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. తనకు వివాహం కాకపోవడానికి కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అని స్పష్టం చేసింది. అదేంటి ఆయనకు మీకు పెళ్లి కాకపోవడానికి సంబంధం ఏంటని..? ప్రశ్నించగా.. సరదాగా స్పందించింది టబు.

వాస్తవానికి టబుకి అజయ్ దేవగన్ యంగ్ ఏజ్ నుండే తెలుసట. టబు, ఆమె కజిన్ సమీర్, అజయ్ దేవగన్ లు అప్పట్లో మంచి స్నేహితులట. ఆ సమయంలో టబు వెంట చాలా మంది అబ్బాయిలు ప్రేమించమని తిరిగేవారట. అలా ఎవరు చేస్తున్నారో.. తెలుసుకొని అజయ్, సమీర్ లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేవారట. దీంతో అబ్బాయిలు టబుతో మాట్లాడానికి కూడా
భయపడేవారట. అలా భయపడి ఎవరు నా దగ్గరకు పెళ్లి చేసుకుంటామని రాలేదేమో అంటూ వెల్లడించింది.