HomeTelugu Reviews'టాక్సీవాలా' రివ్యూ

‘టాక్సీవాలా’ రివ్యూ

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్‌ లో రిలీజ్ కావటంతో రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ మేరకు ఆకట్టుకుంది..? విజయ్‌ దేవరకొండ మరోసారి తన సత్తా చూపించాడా..?

13 3

కథ : హీరో శివ (విజయ్‌ దేవరకొండ) అతి కష్టమీద ఐదేళ్లపాటు చదివి డిగ్రీ పూర్తిచేసిన కుర్రాడు. అన్నా వదినలకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చేస్తాడు. ముందు ఒకటి రెండు జాబ్స్‌ ట్రై చేసిన వర్క్‌ అవుట్ కాకపోవటంతో క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేయాలనకుంటాడు. తన వదిన బంగారం అమ్మి ఇచ్చిన డబ్బుతో ఓ పాత కారును కొని టాక్సీగా మారుస్తాడు శివ. టాక్సీ తొలి రైడ్‌లోనే అను (ప్రియాంక జవాల్కర్‌) అమ్మాయితో ప్రేమలో పడతాడు. అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో ఆ టాక్సీలో దెయ్యం ఉందని తెలుస్తుంది. నిజంగానే టాక్సీలో దెయ్యం ఉందా..? ఈ పరిస్థితుల్లో శివ ఏం చేశాడు..? అసలు టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథతో అను, శిశిర (మాళవిక నాయర్‌)లకు ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే కథ.

నటీనటులు: విజయ్‌ దేవరకొండ మరోసారి తన యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిజం, స్టైల్‌తో పాటు ఎమోషన్స్‌, భయం కూడా చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాల్లో విజయ్‌ నటన అద్భుతంగా అనిపిస్తుంది. హీరోయిన్‌గా పరిచయమైన ప్రియాంక గ్లామర్‌ రోల్‌ లో ఆకట్టుకుంది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధన్యత లేకపోవటంతో పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేదు. మాళవిక నాయర్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. హీరో ఫ్రెండ్‌గా నటించిన మధుసూదన్‌ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. ఇతర పాత్రల్లో శిజు, కళ్యాణీ, యమున, రవివర్మ, రవిప్రకాష్‌, ఉత్తేజ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

13a 1

విశ్లేషణ : తెలుగులో పెద్దగా కనిపించని సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ ఎంచుకున్న దర్శకుడు రాహుల్‌, అనుకున్న కథను తెర మీద చూపించటంలో విజయం సాధించాడు. సినిమాకు ప్రధాన బలం కామెడీ. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్ అంతా హీరో, ఫ్రెండ్స్‌ మధ్య వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండ్‌ హాఫ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కాస్త తగ్గినా మార్చురీ సీన్‌ సూపర్బ్ అనిపిస్తుంది. క్లైమాక్స్‌ లో వచ్చే ఎమోషనల్‌ సన్నీవేశాలు ప్రేక్షకుడికి కంటతడి పెట్టిస్తాయి. గ్రాఫిక్స్‌ నిరాశపరుస్తాయి. ఈ తరహా సినిమాలకు సినిమాటోగ్రఫి చాలా కీలకం. సుజిత్‌ సారంగ్‌ సినిమా మూడ్‌కు తగ్గ విజువల్స్‌తో మెప్పించాడు. ఒక్క ‘మాటే వినుదుగా’ పాట తప్ప మిగతా పాటలేవి గుర్తుండేలా లేవు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

13b 1

హైలైట్స్
విజయ్‌ దేవరకొండ నటన

డ్రాబ్యాక్స్
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని స‌న్నివేశాలు

చివరిగా :సాఫీగా దేవరకొండ ‘టాక్సీవాలా’
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : టాక్సీవాలా
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌, కళ్యాణీ, ఉత్తేజ్‌
సంగీతం : జాక్స్‌ బెజోయ్‌
దర్శకత్వం : రాహుల్ సంక్రిత్యాన్‌
నిర్మాత : ఎస్‌కేయన్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. నోటా సినిమాతో నిరాశపరిచిన విజయ్‌ ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమా రిలీజ్‌ కన్నా చాలా రోజుల ముందే ఆన్‌లైన్‌ లో రిలీజ్ కావటంతో రిజల్ట్‌ ఎలా ఉండబోతుందన్న ఆందోళనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఇప్పటికే చాలా వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సీవాలా ఏ...'టాక్సీవాలా' రివ్యూ