Homeతెలుగు Newsతెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు?

తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌ పొత్తు?

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు సాధించిన పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుంది. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో ఒంటరిగా 60 సీట్లు సాధించడం కష్టమనే భావనలో ఉన్నాయి. అందుకే కలిసొచ్చే పార్టీలను కలుపుకొంటూ విజయం దిశగా ముందుకెళ్లాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో వివిధ జిల్లాల నేతలు, ఇంఛార్జిలతో సమావేశాలు జరిపారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు సైతం పొత్తులపై గాంధీభవన్‌లో చర్చలు జరిపారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే టీడీపీతో జత కడితే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

9 7

తెలంగాణలో టీడీపీలో బీసీలు ఎక్కువ. అంతేకాకుండా టీడీపీ బీసీలకు అనుకూలమనే ముద్ర కూడా ఉంది. కాంగ్రెస్‌తో కలిస్తే ఇరు పార్టీలకు ఉభయతారకంగా ఉంటుందనే కాంగ్రెస్‌లోని బీసీ నేతలూ అంచనా వేస్తున్నారు. టీడీపీకి ఉన్న బీసీ ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్ తరలించుకుపోకుండా జాగ్రత్త పడాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పాత లెక్కల ప్రకారం చూస్తే 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ 21 సీట్లు మాత్రమే దక్కించుకుంది. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్ 63 సీట్లు గెలుచుకుంది. తెలంగాణ టీడీపీ 15, బీజేపీ 5 సీట్లు పొత్తులతో దక్కించుకున్నాయి. బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించడం తెలంగాణ బీసీల్లో టీడీపీకి మంచి పట్టుండటం, సెటిలర్ల మద్దతు గత ఎన్నికల్లో టీడీపీకి కలిసొచ్చిందని కాంగ్రెస్ నేతలే విశ్లేషిస్తున్నారు. టీడీపీతో పొత్తుకు వెళ్లడమే మంచిదని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu