HomeTelugu Big Storiesటీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

7 19టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఇటీవల చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికి ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు. దీంతో కొద్ది సేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పరామర్శించారు.

అనారోగ్య సమస్యలకు తోడు ఆయన ఇన్‌ఫెక్షన్ బారినపడడంతో వైద్యులు కుటుంబ సభ్యులతో శివప్రసాద్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. శివప్రసాద్ వృత్తిరీత్యా వైద్యుడు కాగా ప్రవృత్తి రీత్యా నటుడు. శివప్రసాద్ 1951 జులై పదకొండున నాగయ్య, చెంగమ్మ దంపతులకు జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. తిరుపతిలో డాక్టర్ గా సేవలందిస్తూ సినీరంగంలో ప్రవేశించారు. అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు. కొన్ని సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.

2006లో విడుదలైన డేంజర్ చిత్రంలో శివప్రసాద్ పోషించిన విలన్ పాత్రకు నంది అవార్డు లభించింది. వైద్యం, సినిమా రంగం తర్వాత శివప్రసాద్ దృష్టి రాజకీయాల వైపు మళ్లింది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శివప్రసాద్ 2009లో చిత్తూరు టీడీపీ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 లోనూ శివప్రసాద్ ఎంపీగా గెలిచారు. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగా శివప్రసాద్ గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu