సాదినేని యామిని పేరుతో అసభ్యకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె మహిళా సంరక్షణ విభాగం ఎస్పీ సరితకు ఫిర్యాదు లేఖను అందజేశారు. అనంతరం యామిని మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఫోన్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తనతో పాటు కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ
విషయంపై సీఎం జగన్‌ను కలిసి వివరిస్తానని మహిళలకు సీఎం రక్షణ కల్పిస్తారని భావిస్తున్నానని యామిని చెప్పారు.