తెలంగాణ అసెంబ్లీ రద్దు

ఈరోజు మధ్యాహ్నం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఏకవాక్య తీర్మానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. అసెంబ్లీని రద్దు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కేవలం 2 నిమిషాల పాటే జరిగిన సమావేశంలో నిర్ణయించిన సమయానికి సీఎం తీర్మానంపై సంతకం చేసినట్లు సమాచారం. తీర్మాన ప్రతిని గవర్నర్‌ నరసింహన్‌కు అందజేసేందుకు ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులందరూ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఏ పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నామన్న అంశంపై కేసీఆర్‌ గవర్నర్‌కు వివరించారు.

గవర్నర్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌ గన్‌పార్క్‌ వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.