HomeTelugu Big Storiesతెలుగు బిగ్‌బాస్‌-4 లోగో లాంచ్‌

తెలుగు బిగ్‌బాస్‌-4 లోగో లాంచ్‌

Telugu Bigg boss
‘బిగ్ బాస్- 4’ సీజన్‌ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రియాలిటీ షోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రేటింగ్ విషయంలోనూ బిగ్‌బాస్ ఎప్పుడూ నిరాశ పరచలేదు. దాంతో నిర్వాహకులు కూడా 4వ సీజన్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త సీజన్ కోసం మరోసారి నాగార్జున హోస్టుగా కన్ఫర్మ్ అయ్యాడు. కరోనా కారణంగా అసలు ఈ షో ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ‘స్టార్ మా’.

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 4 ఉంటుందని ప్రోమో విడుదల చేసింది. కంటెస్టెంట్స్, హోస్ట్‌ మిగతా విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అన్నీకుదిరితే సెప్టెంబర్‌లో బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కానుంది. అప్పటికి కరోనా నియంత్రణలోకి రాకుంటే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేవు. ఇక ఈ సీజన్ కోసం తరుణ్, శ్రద్ధాదాస్, హంసానందిని, రష్మిగౌతమ్, సింగర్ సునీత, బిత్తిరి సత్తి, యాంకర్ రవి, యాంకర్ లాస్య, శ్రీరాపాక లాంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu