Homeతెలుగు Newsకొందరికి చౌకీదార్ అంటే భయం: మోడీ

కొందరికి చౌకీదార్ అంటే భయం: మోడీ

8 7‘కొందరికి చౌకీదార్ అంటే భయం. అందుకే వాళ్లు నన్ను అధికారం నుంచి తప్పించాలనుకుంటున్నారని’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పరోక్షంగా విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. కేవలం తమను వ్యతిరేకించేందుకే మొహాలు చూసుకొనేందుకు ఇష్టపడని రాజకీయ ప్రత్యర్థులు చేతులు కలుపుతున్నారని ఎద్దేవా చేశారు. సుమారుగా 99% వస్తువులను 28% కంటే తక్కువ జీఎస్టీ శ్లాబ్ లోకి తీసుకు రావడం జరిగిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ప్రధాని మోడీ రూ.3,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గంగ నుంచి ఆగ్రాకు తాగునీరు ఇచ్చే ప్రతిష్ఠాత్మక గంగాజల్ ప్రాజెక్ట్, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్య విషయిక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఆగ్రాకు వచ్చిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. గంగాజల్ ప్రాజెక్ట్ ఆగ్రాకు ప్రధాని ఇచ్చిన బహుమతిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. గంగాజల్ ప్రాజెక్ట్ వల్ల ఆగ్రావాసులకే కాకుండా పర్యాటకులకు సైతం పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుందని ప్రధాని అన్నారు. గంగాజల్ ప్రాజెక్ట్, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటివి ఆగ్రా స్మార్ట్ సిటీ అయ్యేందుకు చేపట్టిన చర్యలని తెలిపారు. భద్రత, పర్యావరణం బాగుంటే పర్యాటకులు ఆగ్రాలో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారని.. ఇది పర్యాటక రంగ అభివృద్ధికి సాయపడుతుందని తెలిపారు. నమామి గంగా మిషన్ కింద యమునా నదిని శుభ్రపరచడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా మోడీ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu