టైగర్‌కు దిశా గుడ్‌బై చెప్పేసిందా..!


బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ బాలీవుడ్‌లో వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. టైగర్‌, దిశా కలిసి డిన్నర్లకు, పార్టీలకు కలిసే వెళుతుండటమే దీనికి కారణం. ఎప్పటికప్పుడు వీరి ఫొటోలు బయటికి వస్తూనే ఉంటాయి. ప్రేమికుల రోజున ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే రకమైన పోజ్‌తో
ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేశారు. టైగర్‌ తన ఫొటోకు ‘ప్రేమలో ఉన్నా’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు.

‘ఇద్దరికీ సిగ్గే.. అందుకే ఏ విషయమూ చెప్పలేకపోతున్నాం’ అంటూ దిశా ఓసారి మీడియాతో అన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని వార్తలు వస్తున్నాయి. పరస్పరం చర్చించుకునే విడిపోయారని మీడియాలో కథనాలు. కొన్ని వారాలుగా దిశా, టైగర్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయని.. అందుకే ఎవరిదారి వారు చూసుకోవాలని
నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ప్రేమలో ఉన్న విషయమే బయటపెట్టలేదు. ఇక విడిపోయిన విషయం ఎందుకు వెల్లడిస్తారు? ఇద్దరికీ చాలా మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. కాబట్టి వీరూ స్నేహితుల్లాగే ఉంటారని టాక్‌.