‘పెట్ట’ లో క్లాసి టచ్ ఇచ్చిన రజనీ

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘పెట్ట’. ఈ సినిమా జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. కాగా కొద్దిసేపటి క్రితమే పేట కు సంబంధించిన ఓ ఫోటో రిలీజ్ అయింది. పెట్ట ట్రైలర్ రిలీజ్ పోస్టర్ అది.

గ్రీన్ కలర్ వింటేజ్ కారు, దానికి ఆనుకొని అచ్చమైన తమిళ ట్రెడిషన్ లో తలైవా నిలబడిన ఫోటో అది. మెలితిరిగిన మీసాలతో కూలింగ్ గ్లాస్ తో వావ్ అనిపించే విధంగా ఉన్న ఫోటో తలైవర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. సినిమాపై అంచనాలను పెంచుతున్నది. రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ఆకట్టుకుంటే చాలు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు.