HomeTelugu Trendingబిగ్‌బాస్‌-5 దుర్గారావు!

బిగ్‌బాస్‌-5 దుర్గారావు!

Tiktok durga rao in bigg bo
టిక్‌ టాక్‌ దుర్గారావు తన భార్యతో కలిసి వేసిన స్టెప్పుల్లో సోషల్‌ మీడియాలో ఎంత ఫేమస్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. ఎక్కడో పల్లెటూరిలో పుట్టిన పెరిగిన దుర్గారావు..టిక్‌టాక్‌ ద్వారా ఫేమస్‌ అయ్యాడు. ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటతో దుర్గారావు మరింత ఫేమస్ అయ్యాడు. ఈ మధ్యే జగపతిబాబుతో కలిసి స్టేజీపై డాన్సులు కుమ్మేశాడు దుర్గా రావు. ఇటీవల విడుదలైన రవితేజ ‘క్రాక్‌’లో మెరిశాడు . ఇలా పలు సినిమాల్లో చాన్స్‌ కొట్టేసిన దుర్గారావుకు.. తాజాగా మరో బంపరాఫర్‌ తగిలిందని ప్రచారం సాగుతోంది. బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి దుర్గారావు ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దుర్గా రావుకు ఉన్న ఫాలోయింగ్‌ బిగ్‌బాస్-5 తెలుగులో కంటెస్టెంట్‌గా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌, యాంక‌ర్ ర‌వి, హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? ఐదో సీజన్‌లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!