ఈడీ విచారణకు హజరైన తనీష్‌

టాలీవుడ్‌ నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్‌ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలుపై కూడా ఆరాతీయనుంది. అంతేకాకుండా ఎఫ్‌ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు.

ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కెల్విన్‌ సమక్షంలో తనీష్‌ను సుధీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2017లో తనీష్‌ ఎక్సైజ్‌ విచారణను సైతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ఇప్పటికే 10మంది సినీ ప్రముఖులను పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ముమైత్ ఖాన్, నవదీప్ వంటి వారు విచారణకు హాజరయ్యారు.

CLICK HERE!! For the aha Latest Updates