HomeTelugu Newsరెమ్యూనరేషన్‌ పెంచేసిన యంగ్‌ హీరో

రెమ్యూనరేషన్‌ పెంచేసిన యంగ్‌ హీరో

Tollywood young hero has in
టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా ఫుల్‌ ఫామ్‌లోకి వెళ్లిపోయాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై హనుమాన్ కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

వరల్డ్బా వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా టోటల్ గ్రాస్ 300 కోట్లకు చేరుకుంది. ఇంత పెద్ద విజయం వస్తే హీరోలు పారితోషికం పెంచుకోవడం సహజం. ఇప్పుడు తేజ సజ్జ కూడా అదే చేశాడని టాక్‌. ‘హనుమాన్’ సినిమా కోసం తేజ సజ్జ కోటి రూపాయలలోపే పారితోషికం తీసుకున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరడంతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దాంతో ఈ కుర్ర హీరో రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వస్తున్నాయి. ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట తేజ.

అయితే ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు తేజ పాన్ ఇండియా స్టార్.. అందుకే తను చేయబోయే కొత్త సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రెడీ అవుతాయి. దీంతో ఈ టైమ్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పులేదు అంటున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!