HomeTelugu TrendingTop 10 Indian Heroes జాబితా చూశారా?

Top 10 Indian Heroes జాబితా చూశారా?

Top 10 Indian Heroes List will shock you
Top 10 Indian Heroes List will shock you

Top 10 Indian Heroes 2025:

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దశలు మారుతున్నాయి. ఓప్పుడు బాలీవుడ్ హీరోలు మాత్రమే టాప్‌లో ఉండేవారు. కానీ ఇప్పుడు సౌత్ స్టార్స్‌ వేరే లెవెల్‌కి వెళ్లిపోయారు. తాజాగా Ormax Media విడుదల చేసిన మార్చి 2025 లిస్టులో దానికి మరోసారి సాక్ష్యమిచ్చింది.

ఈ టాప్ 10 పాపులర్ మేల్ యాక్టర్స్ లిస్ట్‌లో సౌత్ స్టార్స్ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. బాలీవుడ్‌ నుండి కేవలం మూడుగురు మాత్రమే చోటు దక్కించుకోగలిగారు – షారుక్ ఖాన్ (4వ స్థానం), సల్మాన్ ఖాన్ (9వ స్థానం), అక్షయ్ కుమార్ (10వ స్థానం).

అయితే, మొదటి స్థానం ఎవరిదంటే?

ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్‌దే! Kalki 2898 AD: Part 2, Salaar: Part 2, Spirit, The Raja Saab, Fauji లాంటి భారీ సినిమాలతో రాబోతున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతోంది.

2వ స్థానంలో తమిళ స్టార్ తలపతి విజయ్, 3వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. 4వ స్థానానికి షారుక్ ఖాన్ చేరుకోవడం గమనార్హం. 5 నుంచి 8 స్థానాల్లో మహేశ్ బాబు, అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు.

ఇప్పుడు సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా కాకుండా గ్లోబల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. కేవలం భాష పరంగా కాకుండా, ఈ స్టార్స్ అందరికీ ఆదరణ లభిస్తోంది.

▶️ Top 10 పాపులర్ హీరోలు (మార్చి 2025):

1. ప్రభాస్

2. తలపతి విజయ్

3. అల్లు అర్జున్

4. షారుక్ ఖాన్

5. మహేశ్ బాబు

6. అజిత్ కుమార్

7. జూనియర్ ఎన్టీఆర్

8. రామ్ చరణ్

9. సల్మాన్ ఖాన్

10. అక్షయ్ కుమార్

Recent Articles English

Gallery

Recent Articles Telugu