HomeTelugu Big StoriesTollywood: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోలు వీళ్ళే

Tollywood: ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న తెలుగు హీరోలు వీళ్ళే

Top 5 Telugu heroes on Instagram

Top 5 Tollywood Heroes on Instagram: టాలీవుడ్‌ హీరోలు ఇటీవలే సోషల్‌ మీడియా బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు. వీరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ కూడా ఉంటుంది. కొంతమంది హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటారు. కొంతమంది అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక అభిమానులు హీరోలు ఏ పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్‌ వైరల్ చేస్తూనే ఉంటారు. హీరోలకి ఓ రెంజ్‌లో ఫాలోవర్స్‌ ఉంటారు.

మన టాలీవుడ్ హీరోల్లో టాప్ 5 ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోలు, ఎవరెవరికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చూద్దాం.. అందరికంటే ఎక్కువగా టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

25 03 2024 04

అల్లు అర్జున్‌: 25 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే ఈ ఫీట్ సాధించి సౌత్ లోనే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు బన్నీ. అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది అల్లు అర్జున్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ కి మన తెలుగులో పాటు కేరళలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా పుష్ప సినిమాతో నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

25 03 2024 07

 

విజయ్ దేవరకొండ:  రెండోవ ప్లేస్‌లో మన రౌడీ హీరో  21.4 మిలియన్స్ ఫాలోవర్స్ తో ఉన్నాడు. అంటే దాదాపు రెండు కోట్ల 14 లక్షల మంది ఫాలోవర్స్ విజయ్ దేవరకొండని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ లో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ లో మూడో ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు.

25 03 2024 08

రామ్ చరణ్: ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 11 లక్షల మంది ఫాలో అవుతున్నారు. రామ్‌ చరణ్ RRR తో నేషనల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాతో మరో సారి పాన్ ఇండియా వైడ్ మెప్పించనున్నాడు.

25 03 2024 05

మహేష్ బాబు: నాలుగో ప్లేస్ లో 13.3 మిలియన్ ఫాలోవర్స్ తో ఉన్నారు. అంటే దాదాపు ఒక కోటి 33 లక్షల మంది మహేష్ బాబుని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు. అయితే మహేష్ ఇప్పటివరకు అన్ని రీజనల్ సినిమాలు చేసి కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు. నెక్స్ట్ రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ తరువాతమహేష్‌కు ఫాలోవర్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

25 03 2024 06

ప్రభాస్: ఐదో ప్లేస్ లో ఉన్నాడు. ప్రభాస్ ని ఇన్‌స్టాగ్రామ్ లో 11.7 మిలియన్ ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు ఒక కోటి 17 లక్షల మంది. అయితే ప్రభాస్ చాలా లేట్ గా, ఇటీవలే సోషల్ మీడియాలోకి వచ్చాడు. అంతేకాక ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అందుకే ప్రభాస్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉన్నా కూడా తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా టాలీవుడ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన టాప్ 5 హీరోలుగా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు ఉన్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!