లోకేష్‌కి ప్రత్యర్థిగా తమన్నా

గుంటూరు జిల్లా మంగళగిరిలో తొలిసారిగా ట్రాన్స్ జెండర్ అయిన తమన్నా సింహాద్రి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళగిరి రిటర్నింగ్ ఆఫీస్ కి వచ్చారు. స్వార్థపూరిత రాజకీయాల విముక్తి చేయటానికి ,వ్యభిచార రాజకీయాలకు స్వస్తి పలకటానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఒక సన్యాసిని 24 గంటలు ప్రజా సేవకై ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మొదట్లో జనసేనాని పార్టి నుండి టిక్కెట్ ఆశించాను… కానీ నిరాకరించారని తెలిపారు. నాలుగు గోడలకే పరిమితం కాకూడదని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటికి సిద్ధపడ్డానన్నారు. రాజధాని అమరావతికి మంగళగిరి కీలకమన్నారు. నారా లోకేష్ ఏం ఆశించి ఇక్కడ పోటి చేస్తున్నారని ప్రశ్నించారు తమన్నా.లోకేష్ MLC పదవికి రాజీనామా చేసి MLAకి పోటి చేయాలన్నారు. భూకబ్జాల కోసమే లోకేష్ ఇక్కడ నుండి పోటి చేస్తున్నారని విమర్శించారు. ట్రాన్ప్‌జెండర్ అందరుహక్కుల సాధనకోసం మెరుగైన సమాజం కోసం భవిషత్ లో అన్ని నియోజకవర్గాల్లో పోటి చేయాలని ఈ సందర్భంగా తమన్నా పిలుపునిచ్చారు.