నాగ్ తో మరోసారి రొమాన్స్ చేయనుంది!

దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొంది దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. పెళ్లి ఆగిపోయేసరికి సినిమాల మీద ఫోకస్ పెట్టి తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు గ్లామర్ రోల్స్ లో కూడా నటిస్తోంది. తాజాగా త్రిష ఓ స్టార్ హీరో సరసన సినిమా చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ప్రస్తుతం ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో నటిస్తున్నారు.

దీని తరువాత ‘రాజు గారి గది’ సీక్వెల్ లో నటించబోతున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ నటించనున్నారు. దాని కోసం సీరత్ కపూర్, సమంతలను ఎన్నుకున్నట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో త్రిషను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గతంలో నాగ్, త్రిష కలిసి ‘కింగ్’ సినిమాలో నటించారు. ఆ తరువాత మరోసారి వీరిద్దరు కలిసి నటించనుండడం విశేషం.