
Allu Arjun Ravi Prakash controversy:
సంద్యా 70MM స్టాంపీడ్ ఇష్యూ నుండి టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఆ రోజునుంచి రవి ప్రకాష్ ప్రతి సందర్భంలోనూ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ, ఈ ఇష్యూ ఎలా హ్యాండిల్ చేశారు, ‘పుష్ప 2’ కలెక్షన్ల వరకు నెగెటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు.
తాజాగా, డిప్యూటీ సీఎం ఇష్యూ, ఐటీ దాడుల నేపథ్యంలో కూడా అల్లు అర్జున్‌పై రవి ప్రకాష్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “పుష్ప 2” నిర్మాతలు, దర్శకులపై ఐటీ దాడులపై మాట్లాడే సమయంలో, అల్లు అర్జున్ వ్యాపార భాగస్వామ్యాల గురించి మాట్లాడటానికి వెనుకాడలేదు. గతం నుంచి పరిగణిస్తే, ఈ విమర్శల వెనుక ప్రత్యేక కారణాలున్నట్లు అనిపిస్తోంది.
రవి ప్రకాష్ ఒకప్పుడు టీవీ ప్రపంచంలో స్టార్. టీవీ9లో ఆయన ప్రభావం మంచి పీక్స్‌కి వెళ్లింది. కానీ, మై హోం రమేశ్వర్ రావు, మెగా ఇంజినీరింగ్ వ్యవస్థాపకుడు కృష్ణారెడ్డిల చేతుల్లో చానల్ టేకోవర్ తర్వాత, రవి ప్రకాష్ టీవీ9 నుంచి వైదొలగారు. అప్పటి నుంచి రవి ప్రకాష్ మెగా కృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
గత వారం కూడా రవి ప్రకాష్ కేంద్ర ఆర్థిక మంత్రి నర్మలా సీతారామన్‌కి మెయిల్ పంపి, మెగా కృష్ణారెడ్డిని మరో హర్షద్ మెహతా అని పేర్కొన్నారు. ఇది చూశాక, రవి ప్రకాష్ విమర్శలు ఒక వ్యవస్థ మీద మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఉన్నాయని స్పష్టమవుతోంది.
అల్లు అర్జున్, మై హోమ్ సంస్థలతో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. ఆహా ఓటిటీతో పాటు మరిన్ని బిజినెస్‌లలో కూడా ఈ భాగస్వామ్యం ఉందని సమాచారం. ఈ క్రమంలోనే రవి ప్రకాష్ అల్లు అర్జున్‌పై విమర్శలకు దిగినట్లు అనిపిస్తోంది.