అవికాగోర్‌ను టాలీవుడ్‌ మళ్లీ పిలుస్తోంది

బుల్లి తెరపై చిన్నారి పెళ్లి కూతురుగా ఎదిగి.. ‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హీరోయిన్‌గా ఆకట్టుకున్న అవికా గోర్. ఆ సినిమా తరవాత కొన్ని చిత్రాలు చేసినా క్యాస్టింగ్ కౌచ్ కారణాల వలన తెలుగు పరిశ్రమకు దూరమైంది. ప్రస్తుతం హిందీ సీరియళ్లు చేసుకుంటోంది అవికా. కావాలనే పరిశ్రమను వీడిన ఈమెకు ఇప్పుడు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఒకటి దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ చేస్తున్న చిత్రం కాగా ఇంకొకటి సాయి ధరమ్ తేజ్, మారుతి కలిసి చేస్తున్న సినిమా. ఒకరకంగా ఈ రెండు సినిమాలు ఆమెకు పరిశ్రమలోకి రీ ఎంట్రీ అనే చెప్పొచ్చు.