HomeTelugu Trendingఓటీటీలో వైష్ణవ్‌ తేజ్‌ రెండోవ సినిమా!

ఓటీటీలో వైష్ణవ్‌ తేజ్‌ రెండోవ సినిమా!

Vaishnav tej and krish movi
మెగా హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘ఉప్పెన’. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి వైష్ణవ్ తేజ్‌ పై పడింది. కానీ ‘ఉప్పెన’ విడుదల కాకముందే వైష్ణవ్ తో సినిమా మొదలెట్టాడు దర్శకుడు క్రిష్. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ రాకుంటే ఈ పాటికి విడుదల అయి ఉండేది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు సిద్ధం అవుతున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్ విడదుల అనేది ఎప్పటికి సాధ్యం అవుతుందో తెలియని స్థితి. అందుకే ఓటీటీ వైపు చూస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!