HomeTelugu Trendingబన్నీతో ఒక సినిమా చేయాలని వుంది: 'వెంకీమామ' దర్శకుడు

బన్నీతో ఒక సినిమా చేయాలని వుంది: ‘వెంకీమామ’ దర్శకుడు

10 5
వెంకటేష్ – నాగచైతన్య హీరోలుగా నటించిన ఈ చిత్రం ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి దర్శకుడు బాబీ మాట్లాడుతూ ..”అన్ని తరగతుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించాను.

బయట వెంకటేష్‌ గారిని చైతూ ‘వెంకీమామ’ అని పిలుస్తాడట. ఈ సినిమాలోనూ వాళ్లిద్దరి మధ్య అదే వరస ఉంటుంది గనుక, ఆ టైటిల్ ను ఫిక్స్ చేశాను. టైటిల్ కి మంచి మార్కులు పడ్డాయి. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. నా తదుపరి సినిమా బన్నీతో వుంటుందనే టాక్ నా వరకూ వచ్చింది. బన్నీతో ఒక సినిమా చేయాలని నాకూ వుంది. అలాంటి అవకాశం కోసమే నేను కూడా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!