HomeTelugu Newsబ్యాడ్‌ బాయ్‌గా వెంకటేష్‌.!

బ్యాడ్‌ బాయ్‌గా వెంకటేష్‌.!

3 27

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వెంకటేష్‌కు అంటేనే గుడ్ బాయ్ ఇమేజ్ ఉంది. 34 ఏళ్లుగా ఇదే ఇమేజ్ మెయింటేన్ చేస్తున్నాడు ఈ సీనియర్ హీరో. వెంకటేష్ నిజంగానే మాస్ పాత్ర చేసినా కూడా అందులోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ వెతుక్కుంటారు ఆడియన్స్. ఇప్పటి వరకు బ్యాడ్ బాయ్ పాత్రలు పెద్దగా చేసింది లేదు. కానీ ఇప్పుడు తొలిసారి పూర్తిస్థాయి బ్యాడ్ బాయ్‌గా కనిపించబోతున్నాడు వెంకీ. ప్రస్తుతం ఈయన వెంకీ మామ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఈయన.

దీనికోసం తనను తాను మార్చుకోబోతున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని గుర్రపు స్వారీల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నాడు తరుణ్. ఇందులో రేస్‌లు అంటే పిచ్చి ఉన్న పాత్రలో కనిపించనున్నాడు వెంకటేష్. రేసింగ్ కోసం ఏదైనా చేసే కారెక్టర్ ఇది. ప్రస్తుతం గుర్రపు స్వారీ కోసం రేసింగ్ క్లబ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు వెంకటేష్. మలక్‌పేట్ రేస్ క్లబ్‌లో దీనికి సంబంధించిన సీన్స్ కూడా చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది.

పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత నటుడిగా బిజీ అయిన తరుణ్.. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. వెంకీ కోసం పూర్తిగా భిన్నమైన కథ సిద్ధం చేసాడు. మొత్తానికి చాలా రోజుల తర్వాత వెంకీ కూడా కాస్త కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!