HomeTelugu Trendingహ్యూమన్ కంప్యూటర్‌గా విద్యాబాలన్

హ్యూమన్ కంప్యూటర్‌గా విద్యాబాలన్

3 16
హ్యూమన్ కంప్యూటర్‌గా పేరుపొందిన గణిత మేధావి శకుంతలాదేవి జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అనుమీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలాదేవిగా విద్యాబాలన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు.

టీజర్‌లో శకుంతలా దేవిలా విద్యాబాలన్ ఆకట్టుకుంటోంది. ఎరుపు రంగు చీర, పొట్టి జట్టుతో చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. అను మీనన్ దర్శకత్వంలో రూపొందుతోంది. విద్యాబాలన్‌ కెరీర్‌లో ఇది నాలుగో బయోపిక్ సినిమా. గతంలో ఆమె ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో అలనాటి తార సిల్క్ స్మిత పాత్రలో నటించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లో బసవతారకం పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన మిషన్ మంగళ్ చిత్రంలో ప్రముఖ స్పేస్ సైంటిస్ట్ తారా షిండే పాత్రను పోషించారు.

విద్యా బాలన్ ఇప్పుడు శకుంతలా దేవి పాత్రలో ఎలా మెప్పిస్తారో చూడాలి. కర్ణాటకలో జన్మించిన శకుంతలా దేవి ఎంతటి కష్టమైన సంఖ్యలనైనా మునివేళ్లలపై లెక్కించేసేవారు. అందుకే ఆమెను అందరూ హ్యూమన్ కంప్యూటర్, మెంటల్ కాలిక్యులేటర్ అని పిలుస్తారు. గణితవేత్తగానే కాకుండా రచయిత్రిగానూ శకుంతల ఎంతో ప్రఖ్యాతిగాంచారు. 10 డిజిట్‌ల అంకెలను మరో 10 డిజిట్ల అంకెలతో మల్టిప్లై చేయమంటే కేవలం 20 సెకన్లలోనే ఆన్సర్ చెప్పేసేవారు. అందుకే ఆమెకున్న టాలెంట్‌కు 1982లో గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఆమె రాసిన ది వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్ అనే పుస్తకం భారత దేశంలో స్వలింగ సంపర్కంపై రాసిన మొదటి పుస్తకంగా పేరొందింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu