రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్‌మీడియాలో అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా 5 మిలియన్ల ఫాలోవర్స్‌కు చేరుకుంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇన్‌స్టా ఖాతాను 3.8 మిలియన్ల మంది, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాను 4.6 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇప్పుడు యువ నటుడైన విజయ్ వారిని బీట్ చేయడం విశేషం.
‘పెళ్లి చూపులు’ హిట్‌తో విజయ్‌కు గుర్తింపు లభించింది. ఆపై ‘అర్జున్ రెడ్డి’ మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత వరుస చిత్రాలతో అలరించిన విజయ్.. 2019లో ప్రజలు అత్యధికంగా గూగుల్‌లో వెతికిన దక్షిణాది స్టార్‌గా నిలిచారు. 2018 మార్చి 7న ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. తరచూ తన సినిమా, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ ఏడాది ‘డియర్ కామ్రేడ్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటిస్తున్నారు.
ఇందులో ఆయన నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇజబెల్లా లేట్చి, కేథరిన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఆదివారం రాత్రి రాశీఖన్నా, విజయ్‌ల పోస్టర్‌ను విడుదల చేశారు. 2020లో ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.