HomeTelugu Trending2019లో హాలీవుడ్ సినిమా ప్రపంచం

2019లో హాలీవుడ్ సినిమా ప్రపంచం

2 31
2019లో ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హాలీవుడ్ మరింత దూకుడు చూపించింది. అవతార్ రికార్డులను బద్దలు కొట్టింది. సరికొత్త ఇండస్ట్రీ హిట్‌ను అందుకొంది. అదేవిధంగా లెక్కలేనన్ని సూపర్ హిట్స్ను ఈ ఏడాది ఖాతాలో వేసుకుంది. హాలీవుడ్ ఎక్కువగా సీక్వెల్‌పై ఆధారపడ్డ ఇండస్ట్రీ. ఈ ఏడాది ఏకంగా 58 సీక్వెల్స్ రిలీజయ్యాయి. కేవలం సీక్వెల్స్ మాత్రమే హాలీవుడ్‌కి కాసుల వర్షం కురిపించాయి. వారి నమ్మకాలను నిజంచేస్తూ అవతార్ రికార్డులను సీక్వెల్ మూవీ బద్దలు కొట్టింది. 2019 హాలీవుడ్‌కు సమ్‌థింగ్ స్పెషల్‌గా ట్రీట్ చేసింది.

2009లో వచ్చిన అవతార్ పదేళ్లుగా హాలీవుడ్ నెంబర్ వన్ మూవీగా నిలుస్తూ వచ్చింది. ఈ దశాబ్ద కాలంలో హాలీవుడ్‌లో చాలా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. కానీ అవతార్‌ కలెక్షన్లను క్రాస్ చేయలేకపోయాయి. ఏప్రిల్‌లో విడుదలన అవెంజర్స్ ఎండ్‌ గేమ్ అద్భుతాన్ని చేసింది. హాలీవుడ్ ఎదురుచూస్తున్న రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించింది. ఇండియా సహా పలు దేశాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. సమ్మర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. హాలీవుడ్‌లో నెంబర్ వన్ మూవీ స్థానం అందుకుంది. 2.7 బిలియన్ డాలర్లను కొల్లగొట్టి పదేళ్లుగా హాలీవుడ్ నెంబర్ వన్ మూవీగా కొనసాగుతుంది అవతార్. అవెంజర్స్ ఎండ్‌ గేమ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.19 వేల కోట్లకు పైగా వసూలు చేసినట్లు చెబుతున్నారు.

హాలీవుడ్ అడుగుపెట్టిన ప్రతిచోటా లోకల్ ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. గతంలో ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాలు మాత్రమే ఇండియాలో వివిధ భాషల్లోకి డబ్బింగ్ అయ్యేవి. ఇప్పుడు 100కి కనీసం 40 చిత్రాలు ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. ప్రతి చిత్రాన్ని హాలీవుడ్ నిర్మాతలు ప్రత్యేకంగా చూస్తున్నారు. తమ సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్లలో కొత్త దారులను వెతుకుతున్నారు. ఫ్రోజెన్-2 చిత్రానికి మహేష్‌బాబు కూతురు సితార వాయిస్ ఓవర్ అందించేందుకు ఒప్పించారు. నవంబర్‌లో విడుదలైన యానిమేషన్ హాలీవుడ్ మూవీ ఫ్రోజన్-2 దాదాపు 50 కోట్లను వసూలు చేసింది. తెలుగు వర్షన్‌కు సితారతో పాటు నిత్యామీనన్ డబ్బింగ్ చెప్పింది. తమిళ వెర్షన్‌కు శృతిహాసన్, హిందీ వెర్షన్‌కు ప్రియాంక చోప్రా సిస్టర్ పరిణితి చోప్రా వాయిస్ ఓవర్ అందించారు. అల్లాద్దీన్‌ సినిమాకు వరుణ్‌తేజ్ వాయిస్ ఓవర్ అందించారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పాడు. హాలీవుడ్ చిత్రాలతో తలపడిన ప్రతిసారీ హిందీ చిత్రాలు భారీగా వసూళ్లను కోల్పోతున్నాయి. ఈ ఏడాది కూడా అదే జరిగింది. ఓ వైపు సైరా, మరోవైపు వార్ వంటి సెన్సేషనల్ చిత్రాల మధ్య రిలీజైన జోకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడటం ఈ ఏడాది ఒక వండర్. ఈ చిత్రం సరాసరి రూ. 70 కోట్లు వసూళ్లు సాధించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu