ప్రొడక్షన్‌లోకి విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్‌లోకి పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి మూవీతో క్రేజీ స్టార్‌గా గుర్తింపు పోందాడు. మూడో ప్రయత్నంగా విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాలో నటించి తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న ఈ హీరో, ఇప్పుడు నోటాతో రాజకీయ నాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజకీయాల చుట్టూనే సినిమా తిరుగు ఉంటుంది. ఇటీవలే నోటా బహిరంగ సభ హైదరాబాద్ లో జరిగింది. ఈ సభలో విజయ్ దేవరకొండ చాలా ఉత్సాహంగా కనిపించాడు. ఈ ఉత్సాహానికి కారణం ఏమిటంటే.. రౌడీతో వస్త్రరంగంలోకి ప్రవేశించిన విజయ్ ఇప్పుడు కింగ్ గా ప్రొడక్షన్ రంగంలోకి రాబోతున్నాడట. మూడు సినిమాలతోనే అమితమైన పేరు తెచ్చుకున్న విజయ్ ప్రొడక్షన్ రంగంలోకి దిగాక ఎటువంటి సినిమాలు చేస్తాడో చూడాలి.