ఫోర్బ్స్ ’30 అండర్‌ 30′ లో ‘అర్జున్‌ రెడ్డి’

క్రీజీ హీరో విజయ్‌ దేవరకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్‌ 30′ లో చోటు దక్కించుకున్నారు. భారత్‌లో 30 ఏళ్ల కన్నా తక్కువ వయసుకు చెంది, తమ తమ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబర్చినవారి జాబితాను ఫోర్బ్స్‌ సోమవారం విడుదల చేసింది. నటుడిగా విజయ్‌ ఈ ఖ్యాతి దక్కించుకు‌న్నారు. ఇదే జాబితాలో ప్రముఖ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన, ప్రముఖ అథ్లెట్ హిమాదాస్‌లకు చోటు దక్కింది.

విజయ్‌ 2011లో ‘నువ్విలా’ సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో అతిథి పాత్రలో సందడి చేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ హిట్‌ అందుకుంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా విజయ్‌కు నటుడిగా సెన్సేషనల్‌ హిట్‌ను ఇచ్చింది. ఈ ఒక్క చిత్రంతో ఆయన‌ బాలీవుడ్ ప్రముఖుల‌కు కూడా సుపరిచితులయ్యారు. గత ఏడాది ఆయన ‘మహానటి’, ‘గీత గోవిందం’ సినిమాలతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు.

కాగా విజయ్‌ ‘రౌడీ’ పేరిటి దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ బ్రాండ్‌కు యువతలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. విజయ్‌ నిర్మాతగానూ అవతారం ఎత్తబోతున్నారు. ఈ ఏడాది ఆయన నిర్మించిన సినిమా విడుదల కాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates