HomeTelugu Trendingవిజయ్ దేవరకొండ సినిమాకి హీరోయిన్‌ సెట్‌ అయ్యింది

విజయ్ దేవరకొండ సినిమాకి హీరోయిన్‌ సెట్‌ అయ్యింది

4 15టాలీవుడ్‌లో పెళ్లి చూపులు సినిమాతో సోలో హిట్ అందుకున్నాక హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ చేశాడు. ఈ సినిమా భారీ హిట్ కొట్టడంతో పాటు యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయం తరువాత దేవరకొండ తిరిగి చూసుకోలేదు. కెరీర్లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ… భారీ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ హీరో ఓ ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలు తీయడం మొదలుపెట్టాడు.

ఇందులో భాగంగా తనకు మొదటి సోలో హిట్ ఇచ్చిన పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకి సమీర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తమిళ సీరియల్ నటి వాణి భోజన్ ను సెలెక్ట్ చేశారు. దేవమగళ్ సీరియల్ తో తమిళనాడులో సూపర్ ఫేమస్ అయ్యింది వాణి భోజన్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu