రేసింగ్ పాఠాలు నేర్చుకుంటున్న విజయ్‌ దేవర కొండ

యువ హీరో విజయ్ దేవరకొండ సినిమా ‘హీరో’ పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనుంది. ఈ సినిమాను ఆనంద్ అన్నామలై డైరెక్ట్ చేయనున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నందున రేసింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అందుకే విజయ్ ముందుగా రేసింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. అది కూడా అంతర్జాతీయ స్థాయి రోడ్ రేసింగ్ ఛాంపియన్ అయిన రజిని కృష్ణన్ వద్ద కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటి మాళవిక మోహనన్ కథానాయికగా నటించనుంది.