గర్ల్‌ఫ్రెండ్‌తో విజయ్ దేవరకొండ పొటోస్ వైరల్‌..!

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో క్రేజీ స్టార్‌గా మారాడు విజయ్ దేవరకొండ. వరుస చిత్రాలతో దూసుకెళ్తున్న ఈ హీరో చేసే కామెంట్లు సినీ, ప్రేక్షక వర్గాల్లో ట్రెండింగ్ మారుతుంటాయి. తాజాగా విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. అయితే విజయ్ దేవరకొండ ఓ విదేశీ భామతో అఫైర్ కొనసాగిస్తున్నాడనే అడపాదడపా వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అవన్నీ రూమర్లుగానే మిగిలిపోయాయి. కానీ తాజాగా ఈ ఫోటోలు వెలుగులోకి రావడంతో నిజమేనా అనే అనుమానం కలుగుతుంది. కాగా ఈ ఫోటోలు ఫారిన్ గర్ల్ ఫ్రెండ్‌తో దిగినవి కావు. అవి అర్జున్ రెడ్డికి ముందు చేసిన ఓ ఫోటోషూట్ అని పేర్కొంటున్నారు. అసలు ఈ విషయంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. విజయ్ దేవరకొండ ఫొటోలు మాత్రం ట్రెండింగ్‌గా మారాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘నోటా’, డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను పోషిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.