రామ్‌ చరణ్‌ కొత్త పొస్టర్‌.. సంబరల్లో అభిమానులు

రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా జనవరి 11న విడుదలకానుంది. అందుకే చిత్ర టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. వాటిలో భాగంగానే ఈరోజు టీమ్ ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్లు వచ్చిన పోస్టర్లు ఒక ఎత్తైతే ఈ పోస్టర్ ఇంకో ఎత్తులా ఉంది. అందులో చరణ్ భారీ తుపాకీ పట్టి భీభత్సం అనేలా కనిపిస్తున్నాడు. అభిమానులంతా ఆ పోస్టర్ చూసి ఇన్నాళ్లు దీన్ని ఎందుకు విడుదల చేయలేదు అంటూ సంబరపడిపోతున్నారు. దీని ద్వారా చిత్రంలో కొత్త తరహా క్లాసీ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. భారీస్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు.