సావిత్రిలో ఆ స్పెషల్ పాత్రలో ఎవరు కనిపిస్తారో..?

మహానటి సావిత్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి దర్శకుడు నాగశ్విన్ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, మరో కీలక పాత్రలో సమంత కనిపించనున్నారు. రీసెంట్ గా ఆ సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. దానికి ఆడియన్స్ నుండి మంచి స్పందనే లభించింది. ఈ సినిమాలో సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను ప్రస్తావించనున్నారు.

దాని బట్టి చూస్తే ఆమె జీవితంలో తమ భర్త జెమిని గణేషన్ పాత్ర చాలా కీలకం. జెమినీ గణేషన్ తో సావిత్రి ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం వంటి విషయాలను చూపించనున్నారు. కాబట్టి ఈ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే ఆసక్తి అందరిలో నెలకొంది. దర్శకుడు మాత్రం ఓ పాపులర్ నటుడితో ఈ పాత్ర చేయించాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఆ నటుడ్ని ఎంపిక చేస్తామని అంటున్నారు. మరి ఆ పాత్ర ఎవరికి దక్కుతుందో.. చూడాలి!