రవితేజకు ధీటుగా బాలీవుడ్ విలన్!

బెంగాల్ టైగర్ సినిమా తరువాత బాగా గ్యాప్ తీసుకున్న రవితేజ ‘టచ్ చేసి చూడు’,’రాజా ది గ్రేట్’ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే ఆ రెండు సినిమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే దిల్ రాజు నిర్మిస్తోన్న ‘రాజా ది గ్రేట్’ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా మెహ్రీన్ కథానాయికగా కనిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ కోసం చాలా మంది పేర్లు పరిశీలించి చివరగా వివాన్ భాటేనాను ఎంపిక చేసుకున్నారు.

వివాన్ పలు హిందీ సీరియల్స్, కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించాడు. ఇప్పటికే దర్శకుడు అనిల్, వివాన్ ను సంప్రదించడం తన పాత్ర కోసం చెప్పడం జరిగిపోయాయి. వివాన్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు విలన్ గా తననే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.