చరణ్ తో తలపడడానికి రెడీ!

రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. చరణ్ తదుపరి సినిమా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే చరణ్ ను ముప్పుతిప్పట్లు పెట్టేందుకు ఓ హీరో కంకణం కట్టుకున్నాడు.

రామ్ చరణ్ ను ముప్పుతిప్పలు పెట్టె హీరో ఎవారా అని ఆలోచిస్తున్నారా? అతనెవరో కాదు…..బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా చేసి విలన్ వేషాలతో సైతం ఆకట్టుకున్న వివేక్ ఒబెరాయ్. వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు వివేక్. ఇప్పుడు బోయపాటి-చరణ్ ల సినిమాలో ఓ కీలకపాత్రని చేయనున్నాడట. అది కచ్చితంగా విలన్ పాత్రనే అంటుంది చిత్ర యూనిట్. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది.