చై-సామ్ మూవీ మేకింగ్‌ వీడియో లీక్‌

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. “నిన్నుకోరి” ఫేం శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం మేకింగ్‌ వీడియో లీక్‌ అయ్యింది. ఇందులో నాగచైతన్య, సమంత ఓ ఇంటిలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. దీన్ని ఓ అభిమాని ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ.. సమంత, చైతన్యను ట్యాగ్‌ చేశారు. “ఈ వీడియో చూశాక.. అద్భుతమైన భావన కల్గింది. అందమైన దంపతులు. మీరు చైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా సమంత. “మజిలీ” సినిమా విశేషాల కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం” అని ఫ్యాన్స్ పేర్కొన్నారు.

దీన్ని చూసిన సమంత షాకయ్యారు. అతడి ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ షాక్‌లో ఉన్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. ఈ మేకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా ఈ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. అయితే “మజిలీ” అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజులు, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దివ్యాన్ష్‌ కౌశిక్ మరో కథానాయిక. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు.