కమెడియన్ తో శంకర్ సినిమా!

400 కోట్ల బడ్జెట్ తో రజినీకాంత్ హీరోగా రోబో 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత శంకర్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. చియాన్ విక్రమ్ తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ శంకర్ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రోబో2 సినిమా నిర్మానంతర పనుల్లో ఉండగానే, శంకర్ మరో సినిమా కమిట్ అయ్యాడు. అది ఏ స్టార్ హీరోతోనో అనుకుంటే పొరపాటే.. శంకర్ ఓ స్టార్ కమెడియన్ తో సినిమా చేస్తున్నాడు.
వడివేలు ప్రధాన పాత్రలో ‘ఇమస అరసన్2’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు శంకర్. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఫస్ట్ లుక్ ను కూడా చిత్రబృందం లాంచ్ చేయనుంది. జిబ్రన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఎస్.పిక్చర్స్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మిస్తోంది. గతంలో వడివేలు నటించిన ‘హింసించే 23వ రాజు పులకేశి’ సినిమాకు ఇది సీక్వెల్ సినిమా. కాబట్టి ఈ సినిమాను కూడా తెలుగులో అనువదించే అవకాశాలు ఉన్నాయి.