HomeTelugu Trendingడైరెక్టర్‌ని పెళ్లి చేసుకున్న యామీ గౌతమ్

డైరెక్టర్‌ని పెళ్లి చేసుకున్న యామీ గౌతమ్

Yami Gautam Marries Uri Dir

‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ యాడ్‌తో ప్రేక్షకులకు పరిచయమైన యామీ గౌతమ్ ఓ కన్నడ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘విక్కీ డోనర్‌’తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ హీరోయిన్‌ మొదటి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సంపాదించుకుంది. తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం చిత్రాల్లో కనిపించిన ఆమె చివరిసారిగా నితిన్‌ సరసన ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’లో నటించింది. బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యను పెళ్లిచేసుకుంది. కరోనా నిబంధనల దృష్ట్యా ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా యామీ గౌతమ్ తన అభిమానులకు వెల్లడించింది. తన భర్తతో కలిసి వున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం యామీ గౌతమ్ ‘భూత్‌ పోలీస్‌’తో పాటు ‘దస్వి’, ‘ఎ థర్స్‌డే’ చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ ఆదిత్య విక్కీ కౌశల్‌ హీరోగా ‘ద ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ’ సినిమా తీస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!