దాడిపై జగన్ నోరు తెరవాలి:వర్ల రామయ్య

ఆదివారం ఏపియస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విజయవాడలో మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైసీపీ అధినేత జగన్ తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు అని ఆయన అన్నారు. జగన్ పై దాడి విషయంలో వైసీపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వను అని జగన్ చెప్పడం కరెక్టు కాదన్నారు. ఫేక్ టీడీపీ సభ్యత్వాలు సృష్టించి ప్రజల దృష్టి మరల్చాలని చూస్తున్నారన్నారు. టీడీపీ నేతలు దాడి చేశారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఫేక్ ఐడీలు తయారు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాం అని రామయ్య తెలిపారు. జగన్ కు జరిగింది మాట్లాడలేనంత పెద్ద గాయం కాదు.. జరిగిన ఘటనపై జగన్ నోరు తెరవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలకు పాల్పడమని మీకు డైరక్షన్ ఇస్తుంది ఎవరు, దాడి జరిగిన వెంటనే జగన్ కు ఫోన్ చేసింది ఎవరని ప్రశ్నించారు. గవర్నర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి చంద్రబాబు అభిమన్యుడు కాదు అని వర్ల రామయ్య అన్నారు.