గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు. రేపు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.













