కొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల

హ్యాట్రిక్ ప్లాప్‌లతో ఉన్న దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు ఆ ఫ్లాప్‌ల నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. రవితేజ కోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడుతున్నాడు. రవితేజతో చేస్తున్న అమర్‌-అక్బర్-ఆంటోనీ కోసం హాలీవుడ్‌ స్టైల్ ఫాలో అవుతున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. రవితేజ టైం అస్సలు బాగోలేదు. వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ అవి విజయం సాధించడం లేదు. మరోవైపు రవితేజతో పనిచేస్తున్న దర్శకులు కూడా అంతే. రవితేజ ఏరికోరి ఫ్లాప్ దర్శకులతోనే చేస్తున్నట్లనిపిస్తోంది. హ్యాట్రిక్ ఫ్లాప్ డైరెక్టర్ శ్రీనువైట్లతో ప్రస్తుతం అమర్-అక్బర్-ఆంటోనీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. రవితేజ పక్కన గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికోసం హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టి ప్రత్యేక కెమెరాలను తెప్పిస్తున్నాడు ఈ దర్శకుడు వైట్ల. రవితేజ-శ్రీనువైట్ల ట్రాక్ రికార్డుతో పనిలేకుండా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో 8కే రిజల్యూషన్‌తో తెరకెక్కుతున్న తొలి చిత్రం అమర్-అక్బర్-ఆంటోనీ. కొన్నేళ్లుగా వైట్ల సినిమాల్లో కథ కనిపించడం లేదు కానీ ఈసారి కంటెంట్ ప్లస్ టెక్నాలజీతో వస్తున్నాడు. రవితేజ కూడా పూర్తిగా శ్రీనువైట్లపైనే నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా ఈ ఇద్దరికీ హిట్ వస్తుందో లేదో చూడాలి.