అన్నపూర్ణ స్టూడియోస్‌లో కోహ్లి, అఖిల్‌ సందడి.. ఫొటోస్ వైరల్‌

టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్‌ గ్రౌండ్‌లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్‌ తీసుకొని షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నాడు. టెస్టు‌‌ నిమిత్తం కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లారు. స్టూడియోస్‌లో ఆయనపై ఓ ప్రకటనను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఈ సందర్భంగా కోహ్లీ, అక్కినేని అఖిల్‌తో కలిసి సరదాగా ముచ్చటిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్‌ స్టేడియంలో ప్రారంభంకానుంది.