HomeTelugu Newsటాక్సీ డ్రైవర్‌గా సమంత

టాక్సీ డ్రైవర్‌గా సమంత

సమంత అక్కినేని త్వరలోనే సినిమాలకు స్వస్తి చెప్పనున్నట్లు ఓ వార్త హల్చల్‌ చేసింది. ఈ వార్తలపై సమంత స్పందించకపోయినా..ఆమె భర్త నాగచైతన్య స్పందించాడు. సమంత సినిమాలకు స్వస్తి పలుకుందని వస్తున్న వార్తల్లో ఎంటువంటి నిజం లేదని, వివాహం తరువాత సినిమాలో నటించే అవకాశాలు సమంతకు పెరిగాయని, ఈ సమయంలో తను సినిమాలు ఎలా ఆపేస్తుంది అని ప్రశ్నించారు.

5 9

ప్రస్తుతం సమంత తెలుగులో యు టర్న్‌, తమిళంలో సీమరాజా సినిమాల్లో నటిస్తోంది. ఇవి త్వరలోనే విడుదల కాబోతున్నాయి. దీని తరువాత భర్త నాగ చైతన్యతో కలిసి ఓ సినిమా లో నటించబోతుంది. ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో న్యూస్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన గిరిసయ్య దర్శకత్వంలో ఓ హాలీవుడ్‌ తరహా సినిమాలో సమంత నటించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే హాలీవుడ్‌లో సూపర్‌ హిటైన కొలాటేరల్‌ సినిమాలోని పాత్రల ఆధారంగా ఓ కథను తయారు చేసుకున్నాడట గిరిసయ్య. హాలీవుడ్‌ సినిమాలో టామ్‌ క్రూయిజ్‌ హీరోగా నటించాడు. కాగా, టామ్‌ క్రూయిజ్‌ పోషించిన టాక్సీ డ్రైవర్‌ పాత్రలను సమంత చేస్తుందట. కొలాటేరల్‌ స్పూర్తితో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu