ట్విట్ట‌ర్‌కు రంగమ్మత్త రీఎంట్రీ!

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ చిన్నారి అనసూయతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయగా, ఆ ఫోన్ తీసుకొని పగలగొట్టింది ఈ హాట్ యాంకర్. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పలువురు కామెంట్స్ చేయడంతో విసుగుపుట్టి ఈ ఫ్లాట్‌ఫామ్‌ నుండి నేను తప్పుకుంటున్నానని ప్రకటించింది. అంతేనా ఇప్పట్లో సోషల్ మీడియాకు తిరిగొచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ స్టేట్మెంట్ చేసి కొద్దిరోజులు గడవకముందే మళ్ళీ ట్విట్ట‌ర్‌కు రీఎంట్రీ ఇచ్చింది.రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ‘రంగమ్మత్త’ అనే పాత్రలో అనసూయ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతుందో ట్విట్ట‌ర్‌ ద్వారా రివీల్ చేసింది ఈ బ్యూటీ. ఆమె లుక్ కు అభిమానుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. మరి రంగమ్మత్త పాత్రలో తన నటనతో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!